మార్చి 27న ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఇండియాలో లాంచ్ కాబోతోందని కంపెనీ తాజాగా ప్రకటించింది. లాంచ్ అయిన వెంటనే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసం అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5G కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. నోట్ 40X 5G అయితే గతేడాది ఆగస్టులోనే మార్కెట్లోకి వచ్చింది. మరి రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలు తెలుసుకుందాం.
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఇన్ఫినిక్స్ ఈసారి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. నోట్ 50X 5G+లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అందిస్తోంది. ఈ చిప్‌సెట్‌లో నాలుగు కార్టెక్స్ A78 కోర్లు ఉంటాయి, అవి 2.5GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తాయి. గేమింగ్ కోసం ప్రత్యేకంగా మాలి-G615 MC2 GPU ని కూడా యాడ్ చేశారు. 90FPS గేమింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ XOS 15 తో వస్తుంది. XOS 15 లో యానిమేషన్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి, కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. AI ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి. వీటితో రోజువారి జీవితం చాలా సులభతరం అవుతుందని చెప్పుకోవచ్చు. ఐకాన్స్ షేప్, సైజ్, కలర్ మార్చుకోవచ్చు. 25 రకాల ఫాంట్ స్టైల్స్ కూడా ఉన్నాయి. నోట్ 50X 5Gకి TUV సర్టిఫికేషన్ కూడా వచ్చింది. దీని ప్రకారం 5,100mAh బ్యాటరీ ఉంటుంది.
Infinix India (@InfinixIndia) March 7, 2025
![]() |
![]() |