రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తామని, ఏ ఎన్నిక జరిగినా కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గాలు 2021 మార్చిలో జరిగిన ఎన్నికల ద్వారా కొలువుదీరాయి. వీరి ఐదేళ్ల పదవీకాలం 2026 మార్చి-ఏప్రిల్ నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa