హరియాణాలోని కర్నాల్ జిల్లాకు చెందిన జిఝారీ గ్రామంలో సునీల్, శాంకీ అనే ఇద్దరు అన్నదమ్ములు ఓ ఆవును పెంచుతున్నారు. తాజాగా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓ మేళాను నిర్వహించింది. ఇందులో వారు పాల్గొని హోల్ స్టెయిన్ ప్రైసియన్ జాతికి చెందిన సోనీ అనే ఆవు నుంచి ఏకంగా 24 గంటల వ్యవధిలో దాదాపు 87.7 లీటర్ల పాలు సేకరించారు. దీంతో ఆ ఆవు ఆసియాలోనే ఒక్క రోజులో ఎక్కువ పాలు ఇచ్చిన గోవుగా రికార్డు సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa