నిద్రలేమి, ఒత్తిడి, ఎక్కువగా తినడం, ఆయిలీ ఫుడ్ తీసుకోవడం, స్పైసీ, జంక్ ఫుడ్ తినడం ఇలా అనేక కారణాలతో చాలా మంది గ్యాస్ట్రిక్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడతారు. దీంతో పొట్ట మొత్తం ఉబ్బిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కూర్చోలేం, నిల్చోలేం. ఇది రెగ్యులర్‌గా వస్తే జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, లివర్ వంటి అవయవాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అలా కాకుండా సమస్య తగ్గేందుకు కొన్ని ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా వరకూ సమస్య తగ్గుతుంది.
సోంపు
సోంపు తినడం వల్ల కడుపునొప్పి, అసిడిటీ, ఇతర సమస్యలు కూడా చాలా వరకూ తగ్గుతాయి. డైజేషన్ ఈజీగా అవుతుంది. దీనిని మీరు నేరుగా అయినా తీసుకోవచ్చు. లేదా గ్లాసున్నర నీటిలో వేసి మరిగించి గ్లాస్ పరిమాణం వరకూ అయ్యేవరకూ మరిగించి ఆ తర్వాత వడకట్టి తాగండి. దీంతో చాలా వరకూ రిలీఫ్ ఉంటుంది. సలాడ్స్, ఇతర వంటకాల్లో వేయండి.
లవంగం నూనె
లవంగం నూనె వాడడం వల్ల కూడా చాలా వరకూ బ్లోటింగ్, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గేందుకు హెల్ప్ అవుతాయి. ఇందులోని గుణాలు అల్సర్‌కి వ్యతిరేకంగా పోరాడతాయి. దీనికోసం తిన్న తర్వాత లవంగం నూనె తీసుకోవాలి. దీంతో డైజెస్టివ్ ఎంజైమ్స్ పెరిగి గ్యాస్ తగ్గుతుంది.
యాలకులు
దీనిని తయారు చేసేందుకు ముందుగా మెంతులు, జీలకర్ర, కరివేపాకుల్ని టీ స్పూన్ పరిమాణంలో తీసుకుని వేయించి పొడిలా చేయాలి. ఓ చెంచా పొడిని తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. అదే విధంగా, పచ్చి యాలకులు, సోంపు, బ్రౌన్‌షుగర్‌ని పొడిలా చేసి చల్లని పాలలో కలిపి తాగడం వల్ల కూడా గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట, ఇతర కడుపు సమస్యల్ని తగ్గించేందుకు హెల్ప్ చేస్తాయి.
చియా సీడ్స్, అవిసెలు
చియా సీడ్స్, అవిసెలు బరువు తగ్గించి గుండెకి మేలు చేస్తాయనే చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ, వీటిని తీసుకోవడం వల్ల కడుపులో తేమ పెరుగుతుంది. వీటితో పాటు అవిసెల్లో శోథ నిరోధక లక్షణాలు కడుపులోని ఆమ్లతని తగ్గించేందుకు సాయపడతాయి. దీంతో పాటు ఆపాన వాయువు తగ్గి రిలీఫ్‌గా ఉంటుంది.
మజ్జిగ
కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో మజ్జిగ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా అంటే చిటికెడు పసుపు వేసి తాగండి. పుదీనా కలిపితే మరీ మంచిది. లేదా పుదీనాని సెపరేట్‌గా నిమ్మరసం కలిపి తీసుకోండి. ఇలా తీసుకుంటే మీకు ఇన్‌స్టంట్‌గా రిలీఫ్ ఉంటుంది. అదే విధంగా, కాచి చల్లార్చిన పాలని కూడా తాగొచ్చు. ఇవే కాకుండా సిట్రస్ పండ్ల రసాలను తీసుకుంటే కూడా చాలా రిలీఫ్‌గా ఉంటుంది.
హెర్బల్ టీలు
కడుపు ఉబ్బరంతో బాధపడేవారు పాలతో తయారుచేసిన టీ తాగే బదులు హెర్బల్ టీలు తాగడం అలవాటు చేసుకోండి. దీంతో చాలా వరకూ కడుపు ఉబ్బరం తగ్గతుంది. మెంతి టీ, చమోమిలే టీ, అల్లం టీ వంటివి తీసుకోవడం వల్ల కడుపు, ప్రేగు సమస్యలు తగ్గుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇవి గట్ బ్యాక్టీరియాని ప్రేరేపించి జీర్ణక్రియని మెరుగ్గ చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది.
ఇంగువ
ఓ గ్లాసు వేడి నీటిలో చెంచా ఇంగువ కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా చాలా రిలీఫ్‌గా ఉంటుంది.
![]() |
![]() |