ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపు అనంతరం రోహిత్ శర్మ తన కుటుంబంతో కలిసి మాల్దీవులలో పర్యటించాడు. మాల్దీవుల నుండి తిరిగి వస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో రోహిత్ శర్మ, కూతురు సమైరా ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ప్రయత్నించారు. రోహిత్ శర్మ తన కూతురు సమైరాను తీసుకొని కారులోకి ఎక్కేందుకు వెళుతున్న సమయంలో కొంతమంది ఫొటోలు తీయడానికి ప్రయత్నించారు. సమైరా ఫొటోను తీయవద్దని హిట్ మ్యాన్ వారిని వారించాడు. ఆ తర్వాత కూతురును కారులో కూర్చోబెట్టి, ఫొటోగ్రాఫర్లకు, అభిమానులకు నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు.
— Rohan(@rohann__45) March 17, 2025
![]() |
![]() |