సైబర్ నేరగాళ్లు కొత్త ట్రిక్కులు ఉపయోగించి అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. నకిలీ ఓటీపీ మెసేజ్‌లు, కాల్ ఫార్వర్డింగ్ స్కామ్స్ వాడుతున్నారు. ఒక్కసారి మీ అకౌంట్ వాళ్ల చేతికి చిక్కితే మీ పర్సనల్ డేటా మొత్తం వాళ్లకు తెలిసిపోతుంది. మీ బంధుమిత్రులను మోసం చేసి డబ్బులు గుంజుతారు. ఇప్పటికే చాలామంది ఈ ఉచ్చులో పడ్డారు. వాట్సాప్‌లో సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం. హ్యాకర్లు రకరకాల పద్ధతుల్లో అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. ఓటీపీ ఫిషింగ్ అనేది చాలామంది వాడే ట్రిక్. స్కామర్లు వాట్సాప్ సపోర్ట్ టీమ్ నుంచి కాల్ చేస్తున్నట్టుగానో లేదా మీ ఫ్రెండో రిలేటివో అని నమ్మించి, మీ ఫోన్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీ చెప్పమని అడుగుతారు. మీరు చెప్పారో లేదో అంతే, మీ అకౌంట్ వాళ్ల కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. మీ ఫోన్ నంబర్‌కు డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకుంటారు. అప్పుడు మీ వాట్సాప్‌ను వేరే ఫోన్‌లో ఈజీగా ఓపెన్ చేయొచ్చు. వాట్సాప్ వెబ్ హైజాకింగ్ కూడా ప్రమాదకరమే. హ్యాకర్లు కొద్దిసేపు మీ ఫోన్ తీసుకుని, మీ వాట్సాప్‌ను వాళ్ల కంప్యూటర్‌కు లింక్ చేసుకుంటారు. ఇలా చేస్తే మీ మెసేజ్‌లన్నీ వాళ్ల కంప్యూటర్‌లో చూడొచ్చు. కాల్ మెర్జింగ్ స్కామ్ ఇంకో ప్రమాదకరమైన ట్రిక్. స్కామర్ మిమ్మల్ని కాల్ మెర్జ్ చేయమని అడుగుతాడు. మీరు మెర్జ్ చేయగానే అది ఆటోమేటిక్ వాట్సాప్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్‌కు కనెక్ట్ అవుతుంది. వాళ్లు ఓటీపీ వినేసి మీ అకౌంట్ కొట్టేస్తారు.
మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకూడశు అనుకుంటే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్ చేసుకోవాలి. ఇది అదనపు సెక్యూరిటీ లాంటిది. ఒక పిన్ సెట్ చేసుకోవాలి. ఎవరికీ మీ ఓటీపీ చెప్పొద్దు. వాట్సాప్ ఎప్పుడూ ఓటీపీ అడగదు. కాల్ ఫార్వర్డింగ్ ఆఫ్ చేసుకోవాలి. మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు కాల్ చేసి అన్‌ఆథరైజ్డ్ యాక్టివేషన్ జరగకుండా చూడమని చెప్పాలి. వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'లింక్డ్ డివైజెస్' ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు లింక్ చేయని డివైజ్‌లు ఏమైనా ఉంటే లాగ్ ఔట్ చేయండి. ఐఫోన్ వాడుతుంటే 'లాక్‌డౌన్ మోడ్' యాక్టివేట్ చేసుకోవాలి. ఇది అన్‌ఆథరైజ్డ్ డివైజ్ లింకింగ్‌ను బ్లాక్ చేస్తుంది. అనుమానాస్పద మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియని నంబర్లతో కాల్ మెర్జ్ చేయొద్దు.
![]() |
![]() |