దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలతో సహా 3,698 చారిత్రక కట్టడాలు, పురాతన నిర్మాణాలను జాతీయ ప్రాధాన్యం కలిగిన వాటిగా వర్గీకరించామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వాల నియంత్రణ, ఆలయాలకు స్వతంత్రత కోరుతూ మత సంస్థల నుంచి డిమాండ్లు ఏమైనా వచ్చాయా? అని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సోమవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.అలాంటి డిమాండ్ ఏదీ తమదృష్టికి రాలేదని చెప్పారు.
![]() |
![]() |