సకాలంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలుగుతోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తెలిపారు. సోమవారం మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో నిలదీశారు. విద్యార్థులకు మొత్తం ఫీజు రియింబర్స్‌మెంట్ చేస్తారా?..హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా? అంటూ ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్ తెచ్చారని, ఉన్నత చదువులు అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్టడంతో పేదల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కల్పలతారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
![]() |
![]() |