రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని వెలిగండ్ల ఏఎస్ఐ జిలాని భాష వాహనదారులను హెచ్చరించారు. వెలిగండ్లలో ట్రాక్టర్ల డ్రైవర్లకు శుక్రవారం జిలాని భాష కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకును తీసుకువెళ్లే ట్రాక్టర్లు సైడ్ డోర్లు తెరిచి వెళుతుంటారని, అలా వెళ్లడం వలన ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు.
![]() |
![]() |