గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వైసీపీ పాలనలో పంటల విక్రయంలో రైతులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం అమ్మిన రైతులు ఖాతాల్లో 24 గంటల్లో నగదు జమ అవుతోందని వెల్లడించారు.జగన్ ప్రభుత్వం(Jagan Govt)లో పంట విక్రయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మనోహర్ గుర్తు చేశారు. జగన్ చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు వద్ద ధాన్యం కొలుగోళ్లను సులభతరం చేశామని మనోహర్ చెప్పారు.
![]() |
![]() |