వైసీపీకి మర్రి రాజశేఖర్ రాజీనామా చేయడంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత విడదల రజినీ స్పందించారు. మర్రి రాజశేఖర్ ఆత్మ విమర్శ చేసుకోవాలని విడదల రజనీ అన్నారు. మర్రి కుటుంబానికి వైఎస్ కుటుంబం ఎంతో గౌరవం ఇచ్చిందని తెలిపారు. మర్రి గెలుపు కోసం వైఎస్సార్ ప్రచారం చేశారని గుర్తుచేశారు. రెడ్‌బుక్ పాలనలో తన వాయిస్ వినిపించి ఉంటే.. మర్రి గౌరవం ఇంకా పెరిగి ఉండేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చెబితేనే తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశానని విడదల రజినీ తెలిపారు.
![]() |
![]() |