బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు కొన్ని రోడ్లు జలమయం అవ్వగా, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో బెంగళూరు వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. వర్షం తగ్గగానే తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.ఈ క్రమంలో ప్రయాణికులు విమానాల పరిస్థితి గురించి తనిఖీ చేసుకోవాలని ఇండిగో సూచించింది. మీ ప్రయాణం రీషెడ్యూల్ చేయాలనుకుంటే, మీరు మా వెబ్‌సైట్ ద్వారా రీబుకింగ్ లేదా వాపసు ఎంపికలను పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఇతర విమాన సంస్థలు తమ ప్రయాణికులకు రీషెడ్యూలింగ్, రీ బుకింగ్ లేదా టికెట్ వాపసు సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత విమానాల కార్యకలాపాలు సజావుగా కొనసాగిస్తామని ఆయా సంస్థలు తెలిపాయి.
![]() |
![]() |