కడప జిల్లా ముద్దునూరు మండల కేంద్రంలో 108 ప్రభుత్వ వాహనం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడున్న వాహనం 20 రోజుల కిందట మరమ్మతుల కోసం షెడ్డునకు వెళ్లింది. దాని స్థానంలో మరొక దానిని నియమించలేదు.
దీనివలన ప్రసవం కోసం వచ్చే మహిళలకు, ప్రమాదాలు జరిగినప్పుడు నడవలేని వారు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి 108 వాహనాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
![]() |
![]() |