ధర్మవరం పట్టణం బృందావన కాలనీలో సోమవారం ఉదయం పట్టణ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ ప్రభాకర్ గౌడ్ రూరల్ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఇంటింటికీ వెళ్లి అనుమానాస్పద వస్తువుల కోసం సెర్చ్ చేశారు.
ఇంటి కాంపౌండ్ పరిసర ప్రాంతాల్లో సైతం క్షుణ్ణంగా శోధించారు. అనంతరం ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
![]() |
![]() |