ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిలు పెరిగిపోయిన నేపథ్యంలో బకాయిల వసూలు కోసం ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకుంది. పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ నుంచి జీవో జారీ అయ్యింది. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంతో పాటుగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లించేవారికి వడ్డీలో 50 శాతం రాయితీ ఈ నెలాఖరు వరకూ అమల్లో ఉండనుంది.
![]() |
![]() |