పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నాయని మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఇది రోడ్డు ప్రమాదమని ప్రకటించారని, రోడ్డు ప్రమాదమా లేక హత్య అనేది తేల్చాల్సింది పోలీసులు అని తెలిపారు.
ఈ కేసును పారదర్శకంగా విచారణ జరపకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. వైద్యులు పోస్టుమార్టం నివేదికను నిష్పక్షపాతంగా ఇవ్వాలని, తేడా వస్తే రీ పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa