పిఎల్ వెల్త్ మేనేజ్మెంట్, పిఎల్ క్యాపిటల్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగం మ్యూచువల్ ఫండ్ పనితీరు విశ్లేషణలో తాజా అధ్యయనాన్ని వెల్లడించింది. సెక్టోరల్/థీమాటిక్ ఫండ్లను మినహాయించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ జనవరి, 2025లో ₹24,85,843.60 కోట్ల నుండి ఫిబ్రవరి, 2025లో 6.97% తగ్గి ₹23,12,570.67 కోట్లకు చేరిందని పేర్కొంది. 294 ఓపెన్-ఎండ్ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్లను విశ్లేషించిన ఈ అధ్యయనంలో, 54.08% ఫండ్లు ఫిబ్రవరి 28, 2025లో వాటి బెంచ్మార్క్లను అధిగమించాయి. ఈ పీరియడ్లో మొత్తం 159 ఫండ్లు మెరుగైన పనితీరును నమోదు చేశాయి. స్మాల్ క్యాప్ ఫండ్లు అత్యుత్తమ పనితీరు కనబరిచాయి, 79.31% స్కీములు తమ బెంచ్మార్క్ను అధిగమించాయి. వీటి తరువాత, ఫోకస్డ్ ఫండ్స్ 67.86% మరియు లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్స్ 65.63% ఉత్తమ పనితీరుతో నిలిచాయి. లార్జ్ క్యాప్ ఫండ్లు 21.88% నిధులతో తక్కువ పనితీరు కనబరిచిన ఫండ్ కేటగిరీగా ఉన్నాయి.
![]() |
![]() |