కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని , రాష్ట్ర ప్రజలకి నూతన స్వాతంత్య్రం వచ్చిందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు పాలనా సామర్థ్యం గురించి రాష్ట్ర ప్రజలకు తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారంటే అందుకు చంద్రబాబు గారిపై ఉన్న నమ్మకమే కారణమన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మోడల్ కాలనీ, కృష్ణదాసపల్లి, జరుగు గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమాల్లో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. మహిళలు తమపై తాము నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు.
![]() |
![]() |