ఏపీ ప్రభుత్వం ఇటీవల ఢిల్లీలో బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం కుదిరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందం అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సుపరిపాలన, వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీ వినియోగం, వైద్య ఆరోగ్య రంగం, జీవన ప్రమాణాల పెంపుపై ఏపీ ప్రభుత్వం-గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమై అనేక అంశాలపై లోతుగా చర్చించారు.
![]() |
![]() |