ప్రధాని నరేంద్ర మోదీ వారసత్వం గురించి మహారాష్ట్ర అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలుజరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన రాజకీయ జీవితంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.''నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం నియమించింది. అందుకే రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తున్నాను. ఇక పాలిటిక్స్ నాకు ఫుల్‌టైమ్ జాబ్ కాదు. వాస్తవానికి నేను ఒక యోగిని' అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి పనికి ఒక కాలపరిమితి ఉంటుందని.. అదే విధంగా తన రాజకీయ జీవితానికి కూడా పరిమితి ఉంటుందని అన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా హైకమాండ్‌తో తనకు విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను యోగి ఖండించారు. తనకు పార్టీ ఇచ్చిన అవకాశం వల్లే ఇక్కడ కూర్చున్నానని.. పార్టీ పెద్దలతో విభేదాలు ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగేవాడిని కాదని అన్నారు. ఎవరో ఒకరు తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారని.. వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.ఆదివారం నాగ్‌పుర్‌లోని సంఘ్(RSS) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సందర్శించడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లని ప్రధాని ఇప్పుడు వెళ్లడం వెనక ముఖ్యమైన కారణం ఉండొచ్చని అన్నారు. ఆయన పదవీవిరమణ చేయాలని యోచిస్తున్నారని.. తన రిటైర్మెంట్ ప్రణాళికల గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో చర్చలు జరపడానికే అక్కడికి వెళ్లి ఉంటారని అభిప్రాయం వ్యక్తంచేశారు. దేశ రాజకీయ నాయకత్వంలో ఆరెస్సెస్ మార్పు కోరుకొంటోందని, మోదీ వారసుడు మహారాష్ట్ర నుంచే వస్తాడని అన్నారు. ఆయన వ్యాఖ్యలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కొట్టిపడేశారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
![]() |
![]() |