వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, భార్గవ రెడ్డి తదితరులపై ఆంధ్రా ఛాయిస్ అనే పేరుతో ఫేస్ బుక్ ఐడీతో అసభ్యంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అములుచేస్తూ చేయని తప్పులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. టీడీపీ, ఐటీడీపీ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా అకౌంట్‌లలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నా, వారిపై కంప్లైట్ చేస్తున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకి మాత్రమే మనోభావాలు గొప్పవా?, ఇతరులకు మనోభావాలు ఉండవా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఇలాగే చేస్తూ పోతే మాత్రం రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ మేధావులు వింగ్ స్టేట్ సెక్రటరీ కంచర్ల సుధాకర్, నాగులుప్పలపాడు మండల కన్వీనర్ పొలవరపు శ్రీమన్నారాయణ, పార్టీ స్టేట్ నాయకులు పాలడుగు రాజీవ్, పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కందుల దానియేలు, వినోదరాయునిపాలెం గ్రామ సర్పంచ్ ఘట్టమనేని అశోక్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |