భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా పటౌడీ ట్రోఫీని రద్దు చేయాలనే ఆలోచనపై ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనపై ఆమె బీసీసీఐ యొక్క విధానాన్ని ప్రశ్నించారు. తన భర్త, దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ పేరు మీదుగా ఉన్న ఈ ట్రోఫీని తొలగించే ఆలోచనను ఆమె తప్పుబట్టారు.అయితే, ఈసీబీ నుంచి తన కుమారుడు సైఫ్ అలీ ఖాన్ ఒక లేఖ అందిందని, అందులో వారు ఈ ట్రోఫీకి ముగింపు పలకాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారని తెలిపారు. ఒకవేళ బీసీసీఐ కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే, మన్సూర్ అలీ ఖాన్ క్రికెట్‌కు చేసిన సేవలను గుర్తుంచుకోవాలనుకుంటున్నారా, లేక విస్మరించాలనుకుంటున్నారా అనేది వారే నిర్ణయించుకోవాలని ఆమె అన్నారు.మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 1961 నుంచి 1975 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణానంతరం 1997 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కు ఆయన పేరును పెట్టారు. అయితే, పటౌడీ ట్రోఫీని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో కచ్చితమైన కారణం తెలియదు. రెండు దేశాలకు చెందిన ఇతర దిగ్గజాల పేరుతో ఈ ట్రోఫీని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
![]() |
![]() |