ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ మెరుగైన పనితీరు కనబర్చినట్టు కేంద్రం వెల్లడించింది. నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నివేదికలో ఏపీ ఏడో స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఏపీ శాక్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ) మెరుగైన పనితీరు కనబర్చినట్టు నాకో వెల్లడించింది. ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ కృషి ప్రశంసనీయమని పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఎయిడ్స్ మహమ్మారి కట్టడికి కృషి చేసిన ఏపీ శాక్స్ పీడీని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa