శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలైన అనేక ఆర్షభారతీయ ధార్మిక గ్రంథాలు ఇటు తిరుమల నుండి సింహాచలం వరకు అనేక క్షేత్రాల్లో, ఆలయాల్లో పవిత్రంగా గత దశాబ్దన్నర కాలంగా పవిత్రంగా హల్ చల్ చేస్తున్నాయి.ఈ అద్భుతంలో భాగంగా గత ఆదివారం విశ్వావసు నామ ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లోక క్షేమంకరమైన పాలనకోసం హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సహృదయ సౌజన్యంతో పరమాద్భుతమైన తిరుమల క్షేత్ర 'అదివో.. అల్లదివో ' దివ్య గ్రంథాన్ని పిఠాపురంలో అనేక మంది జనసేన నాయకులకు, కాకినాడ తెలుగుదేశం పాలక శ్రేణులకు వందల సంఖ్యలో పంచిన జనసేన పిఠాపురం నియోజక వర్గం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్‌ని అందరూ అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ... అమరావతి, విజయవాడలలో నాలుగు రకాల అఖండ గ్రంథాలతో పవన్ కల్యాణ్‌కి తిరుమల శ్రీనివాసుడు బొల్లినేని కృష్ణయ్య రూపంలో ఆశీర్వచనాలు అందించేలా ఈ అద్భుత గ్రంథాలు దర్శనమివ్వడం ఆనందకరమన్నారు. ఈ సందర్భంలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనలు నభూతో నభవిష్యత్‌గా కనిపించడం ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు.
![]() |
![]() |