అనంతపురం జిల్లాలో ప్రమాదం జరిగింది. పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలోని ఓ గనిలో పేలుడు సంభవించింది. భూగర్భ డోలమైట్ గనిలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే యాడికిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూగర్భ గనిలో పేల్చడానికి నిప్పు పెడుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. డోలమైట్ గనిలో ఉదయం నుంచి కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్లుండి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడగా.. తోటి కార్మికులు వారిని ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa