ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం నేడు భూమి పూజ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 09, 2025, 03:45 PM

చంద్రబాబు రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సంకల్పించారు. ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను నారా లోకేశ్ తన యూట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేశారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో సొంతంగా 5 ఎకరాల స్థలం కొనుక్కున్నారు. సచివాలయం వెనుక ఉన్న ఈ-9 రహదారికి పక్కనే ఈ స్థలం ఉంది. ఓ రైతు నుంచి ఈ స్థలం కొనుగోలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa