కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈనెల 16వ తేదీన సంకటహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించనున్నట్లు ఈవో పెంచల కిషోర్ గురువారం తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమవుతుందన్నారు. ఈ సేవలకు ఆన్ లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చునని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa