వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం పోలీసులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మహిళా విభాగం ఆధ్వర్యంలో సంయుక్తంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనుప్రీత్ రెడ్డి , మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి , అధికార ప్రతినిధి కృష్ణవేణి , సోషల్ మీడియా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షులు నరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa