వ్యాయామం శరీరానికి మంచిదే అయినా దానికీ ఓ లిమిట్ ఉంటుంది. తొందరగా బాడీ పెంచేయాలన్న ఆవేశంలో ఎలా పడితే అలా వర్కౌట్స్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. పైగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే మన బాడీ కొన్ని సంకేతాలిస్తుంది. వాటిని బట్టి వెంటనే రియాక్ట్ అవాలి. మరీ అతిగా వ్యాయామం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా అలెర్ట్ అవకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వర్కౌట్స్ చేయాలి. కానీ ఓ లిమిట్ పెట్టుకోవాలి. ఒక్కసారిగా సిక్స్ ప్యాక్ వచ్చేయాలని హడావుడిగా ఆవేశపడి వ్యాయామాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. చాలా మంది ఈ నిర్లక్ష్యంతోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ అతిగా వ్యాయామాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. ఇది చాలా బేసిక్ రూల్. అందుకే ఏ డాక్టర్ ని అడిగినా ఇదే చెబుతారు. భారీగా వర్కౌట్స్ చేయలేనప్పుడు కనీసం వాకింగ్, జాగింగ్ లాంటివైనా చేయాలని సలహా ఇస్తారు. ఇది ప్రాథమిక ఆరోగ్య సూత్రమే అయినప్పటికీ కొంత మంది పరిమితికి మించి చేస్తారు. సిక్స్ ప్యాక్ రావాలని, ఫలానా హీరోలా కండలు పెంచాలని మితిమీరి కష్టపడుతుంటారు. జిమ్ లలో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో కుప్ప కూలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. వ్యాయామం శరీరానికి మంచిదే అయినా దానికీ ఓ లిమిట్ ఉంటుంది. తొందరగా బాడీ పెంచేయాలన్న ఆవేశంలో ఎలా పడితే అలా వర్కౌట్స్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. పైగా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే మన బాడీ కొన్ని సంకేతాలిస్తుంది. వాటిని బట్టి వెంటనే రియాక్ట్ అవాలి. మరీ అతిగా వ్యాయామం చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా అలెర్ట్ అవకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
విశ్రాంతి చాలా అవసరం
ఎందులోనూ అతి పనికి రాదు. వ్యాయామానికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. చెమటలు కక్కేలా వర్కౌట్స్ చేయడం గొప్ప అనుకుంటాం. కానీ..అది కాస్త తేడా కొట్టిందంటే ప్రాణాలకే ప్రమాదం. అందుకే..ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకో విషయం తెలుసా. విశ్రాంతి తీసుకోవడం కూడా ఓ వ్యాయామమే అంటారు వైద్యులు. సరైన విశ్రాంతి లేనప్పుడు ఎన్ని వర్కౌట్స్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. మన శరీరం విశ్రాంతి కోరుకున్నప్పుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా రెస్ట్ తీసుకోవాలి.
ఏదైనా భారీ వర్కౌట్ చేసినప్పుడు కాసేపు కండరాల నొప్పి రావడం సహజమే. కానీ..రెండు మూడు రోజులైనా ఆ నొప్పులు తగ్గలేదంటే మాత్రం కచ్చితంగా ఆలోచించాలి. ఈ నొప్పిని లైట్ తీసుకుని అలాగే వ్యాయామం చేస్తే తీవ్ర గాయాలయ్యే ప్రమాదముంటుంది. అందుకే..కండరాల నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వర్కౌట్స్ కాస్త బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.
విపరీతమైన నీరసం
ఏదైనా వర్కౌట్స్ చేసే ముందు కాస్తంత నీరసంగా అనిపిస్తుంది. ఒక్కోసారి బద్ధక కూడా వచ్చేస్తుంది. కానీ..ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. సాధారణంగా వచ్చే నీరసమే అయితే పరవాలేదు. కానీ ఒళ్లంతా బరువుగా అనిపించినా, లేదా బాడీ అంతా ఒక్కసారిగా డల్ అయిపోయినా వెంటనే అలెర్ట్ అవాలి. అతిగా వర్కౌట్స్ చేసినప్పుడు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. ముందు రోజు చేసిన వర్కౌట్స్ ఎఫెక్ట్ నుంచి ఇంకా బాడీ బయట పడలేదని అర్థం. ఇలాంటి ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే వ్యాయామాన్ని ఆపేయాలి.
జలుబు చేసినా ఆపాల్సిందే
జలుబు చేసి తుమ్ము, దగ్గు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు వర్కౌట్స్ చేయకపోవడమే మంచిది. ఈ సమయంలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అతిగా వ్యాయామం చేసినప్పుడూ ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. నీరసపడిపోతారు. అలాంటప్పుడు బౌన్స్ బ్యాక్ అవడానికి కాస్త సమయం పడుతుంది. అప్పటి వరకూ విశ్రాంతి తీసుకోవాలి. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు వర్కౌట్స్ చేస్తే అది ఆయాసానికి దారి తీసే ప్రమాదముంది. అప్పుడు సమస్య మరింత పెద్దదవుతుంది. ఆయాసంతోనే వ్యాయామం చేస్తే చాలా డేంజర్. అందుకే కచ్చితంగా వర్కౌట్స్ ఆపాలి.
మూడ్ బాలేనప్పుడు
మూడ్ స్వింగ్స్ చాలా సహజం. ఇది కేవలం అమ్మాయిలకే కాదు. అబ్బాయిలకూ ఉంటుంది. ఒక్కోసారి ఎందుకో చిరాగ్గా అనిపిస్తుంది. ఏ పనీ చేయాలని అనిపించదు. వ్యక్తిగతంగా ఏదైనా సమస్య ఉంటే డిప్రెస్ అవుతారు. ఒక్కోసారి శరీరం వ్యాయామానికి సహకరించదు. రెస్ట్ కోరుకుంటుంది. అలాంటప్పుడు కూడా బలవంతంగా వ్యాయామం చేస్తే సమస్యలు వస్తాయి. అలా కాకుండా కనీసం ఓ రెండు రోజులైనా రెస్ట్ తీసుకుంటే బాడీ రీసెట్ అవుతుంది. అప్పుడు వర్కౌట్స్ మొదలు పెడితే మంచి ఫలితాలుంటాయి.
నిద్రలేమి ఉంటే ఆపండి
ఈ రోజుల్లో నిద్రలేమి అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. రాత్రి 12 గంటల వరకూ నిద్రపోరు. మళ్లీ ఉదయాన్నే త్వరగా మెలకువ వచ్చేస్తుంది. కొందరైతే అర్ధరాత్రి వరకూ రీల్స్ చూస్తూ గడిపేస్తుంటారు. మరి కొందరు ఓటీటీల్లో సినిమాలు చూస్తూ కూర్చుంటారు. ఎందుకిలా అంటే నిద్ర రావడం లేదని సమాధానమిస్తారు. కానీ..నిద్ర వచ్చేందుకు అవసరమైన టిప్స్ మాత్రం పాటించారు. సరైన నిద్ర లేకపోతే జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే కనీసం 6 గంటలైనా కంటి నిండా నిద్రపోవాలి. నిద్ర లేకపోతే నరాల వ్యవస్థ సరిగ్గా పని చేయదు. రోజంతా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. వ్యాయామం ఆపేయాలనడానికి ఇది కూడా ఓ సంకేతమే. రాత్రి నిద్ర లేకుండా ఉదయమే వచ్చి భారీ వర్కౌట్స్ చేయాలని చూస్తే శరీరం అసలు సహకరించదు. అందుకే ఆ రోజు వ్యాయామం పక్కన పెట్టేయాలి.
![]() |
![]() |