ఏపీలోని బాపట్ల జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేయాలంటే ముందు ఆ దారిలోని అడ్డంకులను తొలగించి, కాంక్రీట్ చేస్తారు. అయితే, బాపట్ల జిల్లా దేశాయిపేటలో ఓ కారు రోడ్డుకు ఆనుకుని నిలిపి ఉండగానే, సిమెంట్ రోడ్డు వేసేశారు. ఎందుకిలా కారును తీయకుండా రోడ్డు వేశారు అని పంచాయతీ సిబ్బందిని అడిగితే సిమెంట్ రోడ్డు వేస్తున్నందున కారు తీయాలని ఆ కారు యజమానికి చెప్పామని, కానీ అతడు తాము చెప్పింది వినిపించుకోకుండా ఇంటికి తలుపులు వేసి వెళ్లిపోయాడని వెల్లడించారు. దాంతో కాంట్రాక్టర్ కారు తీయకుండానే రోడ్డుపై కాంక్రీట్ వేసుకుంటూ వచ్చారని పంచాయతీ సిబ్బంది వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa