రేపు ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వచ్ఛ దివస్’ కార్యక్రమం నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. "ప్రతి నెల మూడో శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు ఈ– చెక్ అనే థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలి" అని అధికారులకు మంత్రి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa