వినుకొండ నియోజకవర్గం, ఈపూరు మండలం వనికుంట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ప్రాంగణంలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ, బాలికా విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వారికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ బాలికల వసతి గృహాన్ని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa