ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం అల్లూరిసీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa