వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పక్కనున్న కోటరీ నాపై లేనిపోనివి చెప్పి ఆయన మనసు మార్చింది. కోటరీ వేధింపులు తాళలేక అనేక ఇబ్బందులు పడ్డా. నా నెంబర్-2 స్థానం రెండువేల స్థానానికి పడిపోయింది. వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తికి రాజకీయాలు ఎందుకని అంటున్నారు. మద్యం స్కామ్‌లో బిగ్‌బాస్ ఎవరో రాజ్ కసిరెడ్డిని అడగాలి’’ అని VSR అన్నారు. 2017-18లో రాజ్ కాసిరెడ్డి పార్టీలోకి వచ్చారు.. అతను తెలివైన క్రిమినల్.. అటువంటి వాడు కాదని నేను అతన్ని ఎంకరేజ్ చేశాను.. ఆయనకు ఎన్ ఆర్ ఐ విభాగం, తరువాత ప్రశాంత్ కిషోర్ బాధ్యతలు అప్పగించా.. కానీ, రాజ్ కసిరెడ్డి పార్టీని, ప్రజలను మోసం చేశారని తెలిపారు.. పార్టీని, ప్రజలను రాజ్ కాసిరెడ్డీ మోసం చేశాడు అని అందరికి తెలిసిందే అన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa