జమిలి ఎన్నికలపై మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగనుంది. అనంతరం భారత్‌లోని అన్ని బాషాల్లో క్యూఆర్ కోడ్ సౌకర్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్‌సైట్ అందుబాటులోకి రానుంది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, డా. జస్టిస్ బి.ఎస్. చౌహన్, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.ఝా తదితరులు పాల్గొననున్నారు.కాగా.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 4న ముగియనున్నాయి. ఈ సమావేశాల చివరి వారం మొదటి రోజు పార్లమెంటరీ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉండగా.. ఆ గడువును లోక్ సభ పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.బీజేపీ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వంలోని ఈ ప్యానెల్ తన పనిని ముగించేందుకు మరి కొంత సమయం అవసరమని, ఈ నేపథ్యంలో ప్యానెల్ గడువును పొడిగించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కమిటీలో ప్రస్తుతం 38మంది సభ్యులతో పాటు ఇద్దరు స్పెషల్ ఆహ్వానితులు కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa