కుటుంబసభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు.పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. వైయస్ రాజారెడ్డి ఘాట్ లో ఈ ఉదయం 11 గంటలకు అంత్యక్రియలను నిర్వహించారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతిమ కార్యక్రమాలను ముగించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ సహా కుటుంబసభ్యులంతా హాజరయ్యారు.అంతకు ముందు వివేకా నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్రను నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. భారీ భద్రత మధ్య అంతిమయాత్రలో జగన్ నడిచారు.
వైఎస్ వివేకానందరెడ్డి 1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించారు. వైఎస్సార్‌కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989,1994లలో పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 లలో కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ శాఖా మంత్రిగా పనిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa