ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామూహిక ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2019, 01:34 PM

ఏపీలోని ప్రకాశం జిల్లాలో కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో గ్రామానికి చెందిన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాఘవేంద్ర నాగరాజు(45), ఈశ్వరి(35), వైష్ణవి(13)అక్కడికక్కడే మృతి చెందగా, వరలక్ష్మీ(10) గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందతూ చనిపోయింది. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa