ఏపీలో పెట్రోల్ సరఫరా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పెట్రోల్ బంక్‌ల వద్ద “నో స్టాక్” బోర్డులు కనిపిస్తూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క అధికారులు కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇందులో పెట్రో డీలర్స్ ఫెడరేషన్, HPCL, IOC, BPCL ప్రతినిధులు పాల్గొననున్నారు. సరఫరా లోపాలపై చర్చించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa