ప్రపంచ దేశాలను చమురు సంక్షోభం వణికించేలా కనిపిస్తోంది. ఇరాన్‌కు చెందిన కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తుండటంతో, పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనికి ప్రతిచర్యగా సరకు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఒకవేళ ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. యెమెన్ మిలిటెంట్ గ్రూప్ 'హౌతీ' ఇరాన్‌కు మద్దతుగా నిలవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa