ఉగ్రదాడిలో అమాయకులైన 26 మంది పర్యాటకులను చంపడం దుర్మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉగ్ర దాడులను నిరసిస్తూ శుక్రవారం జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని, ప్రజల్లో చైతన్యం తెచ్చేలా జనసేన కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa