కర్నూలు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో మంత్రి అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వలసలను ఆపేందుకు స్వయంగా ఫోను చేసి మాట్లాడటంతో పాటు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి బుజ్జగిస్తున్నారు. కాగా గతంలో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది. ఆమె సొంత మేనమామ, టీడీపీ నేత ఎస్వీ జగన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్ గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువ కప్పుకున్నారు. ఆళ్లగడ్డ నియోజక వర్గంలో ఎస్ వి సుబ్బారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబాలు ఒక్కటయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa