దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతి సంవత్సరం నియామకాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మినీ రత్న కంపెనీ Bharat Earth Movers Limited (BEML) తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రైల్ అండ్ మెట్రో ప్రొడక్షన్ విభాగంలో మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఈ పోస్టులు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.అర్హతల విషయానికి వస్తే, సంబంధిత విభాగాల్లో ఫుల్‌టైమ్ BE లేదా BTech పూర్తి చేసి ఉండాలి. అదనంగా, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, మెయింటెనెన్స్ వంటి రంగాల్లో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.సెలక్షన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ముందుగా అకడమిక్ మెరిట్ మరియు అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు BEML అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసి, అవసరమైన వ్యక్తిగత, విద్యార్హత, అనుభవ వివరాలను నమోదు చేయాలి. ఫోటో, సిగ్నేచర్, అవసరమైన సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ మార్చి 25 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 7 చివరి తేదీగా నిర్ణయించగా, ఆసక్తి గల అభ్యర్థులు ఆ గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa