అధిక వడ్డీ ఆశ చూపి ఓ సంస్థ ఘారానా మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రూ.270 కోట్లకు పైగా డిపాజిట్లు సేకరిస్తే.. కర్నూలు జిల్లా నుంచే రూ.60-70 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్ బ్లాక్ చేశారంటూ ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డిపాజిట్లు సేకరించి మోసం చేశారంటూ శ్రేయ ఇన్‌ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్‌లిమిటెడ్ కంపెనీపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో కర్నూలు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళ్ళితే.... ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కేంద్రంగా 2020లో స్థాపించిన ఈ కంపెనీకి చైర్మన్ హేమంత్‌కుమార్ రాయ్. రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి) వ్యాపారం పేరిట.. తమ వద్ద పెట్టుబడులు పెడితే ఏడాది తిరక్కుండానే రెట్టింపు ఇస్తామని మభ్యపెట్టారు. ఈ సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి కర్నూలు నగరంలో ఓ భవనం అద్దెకు తీసుకొని ఏజెంట్ల ద్వారా డిపాజిట్ల సేకరణ చేపట్టారు. జనాన్ని నమ్మించడానికి కొంత భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. మొదట్లో డిపాజిట్‌దారులకు నెలనెలా ఖాతాలో నగదు జమ చేస్తుండడంతో నమ్మకం ఏర్పడింది. 2024 జూన్ నుంచి చెల్లింపులు ఆపేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa