హైదరాబాద్‌లో 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశామని, భవిష్యత్ అంతా ఐటీదేనని అపట్లో పిలుపు ఇచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విట్ కాలేజ్ లో వి.లాంచ్ ప్యాడ్‌లో-2025 స్టార్ట్ అప్ ఎక్స్ పో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశముఖ్ బ్లాక్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడికెళ్లిన భారతీయులుంటారని, అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారుని అన్నారు. తెలుగువాళ్ల జనాభా 5 శాతమే.. ఐఐటీల్లో సీట్లు మాత్రం 20 శాతం మనోళ్లవే అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa