పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదిక 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని జనసేనాని అన్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో జనసేన పార్టీ నివాళుల కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుత ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలని అన్నారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని తెలిపారు. ఉగ్రఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని పవన్ గుర్తుచేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌రావు ఫ్యామిలీకి పార్టీ తరఫున రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa