విశాఖపట్నంలోని సింహాచలం ఘటనలో మృతులకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. చందనోత్సవం వేడుక చూసేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై అమర్‌నాథ్ స్పందిస్తూ..ప్రభుత్వ చేతకాని తనంతోనే ఎనిమిది మంది భక్తులు మృతి చెందారన్నారు. భారీ గోడ కూలి భక్తులు చనిపోతే గాలివాన అని సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa