ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 04:41 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ... భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 46 పాయింట్లు నష్టపోయి 79,879కి పడిపోయింది. నిఫ్టీ 1 పాయింట్ నష్టంతో 24,334 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ 47 పైసలు పెరిగి రూ. 84.49గా కొనసాగుతోంది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


మారుతి (3.04%), భారతి ఎయిర్ టెల్ (2.18%), సన్ ఫార్మా (1.41%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.12%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.81%).


టాప్ లూజర్స్:


బజాజ్ ఫిన్ సర్వ్ (-5.45%), బజాజ్ ఫైనాన్స్ (-4.99%), టాటా మోటార్స్ (-3.22%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.91%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.87%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa