కూటమి ప్రభుత్వంలోని సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై పోలీస్ కేసు నమోదయింది. పల్నాడు జిల్లాలోని బుచ్చిపాపన పాలెంలో ఇటీవల తిరునాళ్లు జరిగాయి. ఈ తిరునాళ్లకు హాజరైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వడ్లమూడి వెంకట కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు పలువురిపై రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa