ఏప్రిల్ 11వతేదీన జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీం పట్నం మండలంలోని కొండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. కొండపల్లి కొత్త గేట్ నుండి భారీ బైక్ ర్యాలీతో మంత్రి ఉమాకి ఘనంగా స్వాగతం పలికారు. దారి పొడవునా.. కార్యకర్తలు, ఆటో కార్మికులు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కొండపల్లి గ్రామంలో మేళతాలలతో మంత్రి ఉమాకి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. కొండపల్లి లోని కొట్టగేట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఉమాకి గ్రామ ప్రజలు బంతిపూల వర్షాన్ని కురిపించారు. మళ్ళీ మీరే రావాలి అంటూ కార్యకర్తల చేసిన నినాదాలతో పార్టీ కార్యాలయం మారు మ్రోగింది.
ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ, కొండపల్లి లో ఉన్న గుడి, మసీదు, చర్చ్ లో మతసమరస్యానికి ప్రతీకగా పూజలు, పార్ధనలు నిర్వహించిన మంత్రి ఉమాతో పాటు ఆడపడుచులు, యువత పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.. ఇంటింటికి వెళ్తున్న మంత్రికి ప్రతి గడపాలో మహిళలు హారతులతో కుంకుమ దిద్దుతూ సాదర స్వాగతం పలికారు. కొండపల్లి ప్రచారం లో ఉన్న మంత్రి ఉమని కలసిన వైసీపీ యువ నాయకుడు మోగిలి దయ తన అనుచరులతో టీడీపీ లో చేరారు. దాదాపు 400 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తో కలిసి కొండపల్లి కొత్తగేటు సెంటర్ లో టీడీపీ లో చేరారు. వైసీపీ నాయకులకు టీడీపీ కండువా కప్పి అందరిని సాదరంగా పార్టీలోకి మంత్రి ఉమా ఆహ్వానించారు. ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అలాగే ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఇంత మంది వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ లోకి వస్తున్నారని మంత్రి ఉమ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, చంద్రబాబు చేసిన అభివృదే ఇంత అపూర్వ స్వాగతనికి కారణమని ఆయన తెలిపారు. హత్య రాజకీయాలు చేయాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందిని మరోసారి స్పష్టం అయ్యిందని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. .చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేయాలని పప్పులో కాలేశాడని దుయ్యబట్టారు. రెండు రోజుల్లో పోలీస్ శాఖ నిజానిజాలను బయటపెడుతుంది. మీ జాతకాలు బయటపడనున్నాయని తెలిపారు. జైల్లో ఉండవలసిన జగన్ మోదీ దయాదాక్షణ్యాలపై ఈరోజు బయట ఉన్నాడని తెలిపారు. కొండపల్లి లో జరిగిన అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు..యువత ముఖ్యంగా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులై టీడీపీ లో చేరుతున్నారు అచేసిన అభివృద్ధి చూసి నీతిగా పాలన అందించిన మన ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన కోరారు. ఏప్రిల్ 11న మీ అమూల్యమైన ఓటు అసెంబ్లీ సభ్యుడుగా నాకు, పార్లమెంట్ సభ్యుడుగా కేశినేని నానికి వేసి గెలిపించాలని దేవినేని ఉమా కోరారు. ఈ ఐదేళ్లలో ఇంతటి స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని మరోసారి తమ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని దేవినేని ఉమ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa