ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయలబ్ధి కోసం చావుని కూడా....

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 08:02 PM

రాజకీయలబ్ధి కోసం చావుల‌ని కూడా వాడుకోవ‌టంలో విప‌క్ష నేత జ‌గ‌న్ సిద్ధ‌హ‌స్తుడ‌ని తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని దుయ్యబట్టారు.  ఇంట్లో జ‌రిగిన గొడ‌వ‌లు, ఇత‌ర క‌క్ష‌పూరిత వాతావ‌ర‌ణాల కార‌ణంగా జగన్ బాబాయ్  హ‌త్య‌గావించ‌బ‌డితే దానిని చంద్రబాబునాయుడికి అంట‌గ‌ట్టి నరహంతకుడిలా చిత్రీకరించాలని   చూస్తున్నారని విమ‌ర్శించారు.  అవినీతి ర‌హిత పాల‌నంటూ ప్ర‌చారం ఆరంభించిన జ‌గ‌న్ ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పరిశ్రమల రాయితీ గురించి మీరు  మాట్లాడితే వచ్చే పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోతాయిన సంద‌ర్భాలు అనేకం చూసామ‌ని యామిని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వస్తారని కలలో వచ్చినా పారిశ్రామికవేత్తలు పారిపోతార‌న్న భ‌యం త‌న‌కుంద‌న్నారు.  ఆయన మాటలు నమ్మేవారు ఈ రాష్ట్రంలో లేరని    మండిపడ్డారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa